యూపీ సీఎంకు డీప్‌ఫేక్‌ ఎఫెక్ట్

17
- Advertisement -

డీప్ ఫేక్..ఈ పేరు వింటేనే సెలబ్రెటీలే వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ దగ్గరి నుండి పలువురు హీరోయిన్లు డీప్ ఫేక్‌కు ఎఫెక్ట్ కాగా తాజాగా యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్  ఈ బారిన పడ్డారు.

డయాబెటిస్‌ ఔషధానికి యోగి ప్రచారం చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై సైబర్‌ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రెస్‌ ఆధారంగా వీడియో సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటులు రష్మిక మందన్న, కత్రినా కైఫ్‌, కాజోల్‌, ఆలియా భట్‌ వంటి తదితర స్టార్‌ నటులకు చెందిన నకిలీ వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Also Read:ఆస్కార్ వైభవం.. విజేతలు వీరే

- Advertisement -