TTD:టీటీడీ స్థానికాల‌యాల్లో దీపావళి ఆస్థానం

1
- Advertisement -

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల్లో గురువారం దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వ‌హించారు. గోవింద రాజస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి బాలాలయంలోని స్వామివారికి సమర్పించారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించారు.

కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా గురువారం రాత్రి దీపావ‌ళి ఆస్థానం ఘ‌నంగా నిర్వహించారు.

దీపావళి సందర్భంగా గురువారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

Also Read:క్యాన్సర్ ముప్పు తగ్గించుకోండిలా!

- Advertisement -