11న వివరణ…కవితకు సీబీఐ లేఖ

215
- Advertisement -

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో వివరణ కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తో ఈనెల 11న సమావేశం కావాడానికి సీబీఐ అంగీకరించింది. ఇదే విషయాన్ని సీబీఐ… ఎమ్మెల్సీ కవితకు ఈ-మెయిల్‌ ద్వారా లేఖను పంపించారు. అయితే గతంలోనే కవిత బిజీ షెడ్యూల్‌ వల్ల ఈ నెల6న వివరణకు రాలేకపోతున్నానని తెలిపిన సంగతి తెలిసిందే. సీబీఐకి లేఖ రాసిన కవిత బిజీ షెడ్యూల్‌ వల్ల పలు తేదీలను సూచించింది. వివరణ కోసం ఈ నెల11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ స్పందిస్తూ ఈ నెల 11న వివరణ కోసం వస్తామని ఈ మెయిల్‌ చేశారు. 11వ తేదీన హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఉదయం 11గంటలకు భేటీ అవుతామని సీబీఐ లేఖలో పేర్కొంది.

 

ఇవి కూడా చదవండి…

కంటి వెలుగును సక్సెస్ చేయండి:హరీశ్‌

అన్నింటిలో మేటి మన తెలంగాణ:కేటీఆర్‌

మోడీకి ధీటైనా ప్రత్యర్థి కే‌సి‌ఆరే !

- Advertisement -