తమిళ సినీ స్టార్ కమలహాసన్ ‘మక్కళ్ నీది మయ్యమ్’ అనే రాజకీయపార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 21న తమిళనాడులోని ఒత్తకడై మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కమల్ తన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. అయితే తాజాగా తన పార్టీ సభ్యుల జాబితాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు కమల్ హాసన్.
అంతేకాకుండా తన పార్టీ కోసం పనిచేసే వారిలో వీరే ప్రధాన వ్యక్తులని ఆయన పేర్కొన్నారు.
జాబితా వివరాలు :
1) అరుణాచలం ఎ (వ్యవసాయ నిపుణులు/అడ్వొకేట్)
2. ఏజీ మౌర్య (విశ్రాంత ఐపీఎస్ అధికారి)
3. భారతి కృష్ణకుమార్ (రచయిత/దర్శకులు)
4. సి.రాజశేఖరన్ (అడ్వొకేట్)
5. సీకే కుమారవేల్ (వ్యాపారి)
6. కమీల నజీర్ (ఎంఎస్‌సి, ఎంఫిల్/చలనచిత్ర నిర్మాత/ఫ్యామిలీ కౌన్సెలర్)
7. జ్ఞానసంబంధన్ (ప్రొఫెసర్/రైటర్/స్పీకర్)
8. రాజ నారాయణన్ (రైటర్/జర్నలిస్ట్)
9. రంగరాజన్ (ఎక్స్ ఐఏఎస్)
10. ఆర్ఆర్ శివరామ్ (వ్యాపారి)
11. ఎస్.మూర్తి (ఆర్‌కేఎఫ్ఐ-సీనియర్ ఎగ్జిక్యూటివ్)
12. శౌరిరాజన్ (వ్యాపారి)
13. శ్రీ ప్రియ రాజ్‌కుమార్ (నటి/నిర్మాత/దర్శకురాలు)
14. సుక (రైటర్/డైరెక్టర్)
15. తంగవేలు (కమలహాసన్ సంక్షేమ సంఘం కార్యదర్శి)