KTR:తలసరి ఆదాయంలో మనమే నంబర్‌ వన్‌:కేటీఆర్‌

57
- Advertisement -

కేంద్రంలోని ప్రభుత్వం తెలంగాణ గురించి పట్టించుకోకపోయిన తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ విజనరీతో రాష్ట్రం ఇంత గొప్ప విజయం సాధించిందన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

సీఎం కేసీఆర్ విజనరీతో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,000 మాత్రమే. కానీ సీఎం కేసీఆర్‌ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,17,000కు ఎగబాకిందన్నారు. తొమ్మిదేండ్లలోనే అత్యధికంగా 155 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వనప్పటికీ, ఆర్థికంగా అవస్థలు పెడుతున్నప్పటికీ తెలంగాణ మాత్రం ప్రగతిపథం వైపు దూసుకెళుతున్నదంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి…

ఆటా ఉగాది సాహిత్య వేదిక..

KTR:సమర్థమైన నాయకత్వంతోనే పల్లె అభివృద్ధి..!

Fact Check:అవన్నీ ఫేక్ వార్తలే

- Advertisement -