క్రిస్టియన్ మిషనరీల సేవలు ప్రశంసనీయం:దాసోజు శ్రవణ్‌

30
sravan

పేదరికంలో మగ్గుతున్న విద్య వైద్యం అందించిన క్రిస్టియన్ మిషనరీల సేవలు ప్రశంసనీయమని ఏఐసిసి స్పోక్స్ పర్సన్ దాసోజు శ్రవణ్ అన్నారు. మంగళవారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని షారోను చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయన దాసోజు ఫౌండేషన్ నుంచి 84 మంది పాస్టర్లకు కానుకలు ఖైరతాబాద్ నియోజకవర్గ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ప్రభుదాస్, అసోసియేషన్ అధ్యక్షుడు పీటర్ లతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అనేక మందికి విద్య వైద్యం మిషనరీల ద్వారా అందిందని అన్నారు. క్రైస్తవ సోదరులు ముఖ్యమైన సమస్య గ్రేవ్ యార్డ్ తో పాటు ఇతర సమస్యల పరిష్కరానికి తన వంతు సహాయం చేస్తానని అన్నారు.