అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రజాగాయకుడు గద్దర్ మృతిచెందారు. గద్దర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. గద్దర్ మృతితో ఒక శకం ముగిసింది..ఒక వీరుడు అస్తమించిండు..పేదవాడి గుండె చప్పుడు ఆగిపోయింది…పీడిత తాడిత ప్రజాగళం మూగపోయింది…మన గద్దరన్న ఇక లేరు అన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్.
ప్రజా గాయకుడు ప్రియమైన గద్దరన్న ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందని….గద్దరన్న గొంగడి భుజాన వేసి, కాలికి గజ్జ కట్టి, చేతిలో కర్ర పట్టుకొని పాట పాడుతుంటే, ఆడుతుంటే రగిలిన చైతన్య జ్వాలలు తరతరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. తెలంగాణ సాధన పోరాటంలో గద్దరన్న పాత్ర అసామాన్యమైందన్నారు. అయన మరణం పూడ్చలేని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు, అభిమానులకు సంతాపం తెలియచేశారు.
Also Read:CM KCR:మళ్లీ అధికారం బీఆర్ఎస్‌దే