వినాశకాలే విపరీత బుద్ధి.. రేవంత్ నీకు శిశుపాలుడి గతే పడుతుంది అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కేసీఆర్ అంటే కేవలం మూడు అక్షరాల పేరు కాదు.. అదొక “తెలంగాణ సింహనాదం” ..రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి దురహంకార తీరును ఎండగట్టారు.
కేసీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఈ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక, ఒక అజేయమైన శక్తి… తెలంగాణ అస్తిత్వ జ్వాల కేసీఆర్.. ఆయన్ని ఆర్పాలనుకుంటే నీ అహంకారమే భస్మమైపోతుంది అన్నారు. అధికారం అనేది కేవలం ఐదేళ్ల ‘అద్దె ఇల్లు’ మాత్రమే.. శాశ్వతమైన ‘ప్రైవేట్ ఎస్టేట్’ కాదు!… అధికారాన్ని ప్రత్యర్థుల గొంతు కోసే “కత్తి”లా వాడితే.. అదే కత్తి నీ మెడకు చుట్టుకుంటుంది! ..పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పై అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
చేతనైతే కేసీఆర్ కంటే అన్నిరంగాలలో మెరుగైన విజయాలు సాధించి చూపించు.. వినాశకాలే విపరీత బుద్ధి.. రేవంత్ నీకు శిశుపాలుడి గతే పడుతుంది… ప్రపంచ చరిత్ర పాఠాలు తిరగేయండి.. అణగదొక్కాలని చూస్తే ప్రజల్లో సానుభూతి వెయ్యి రెట్లు పెరుగుతుంది..సూర్యుడిపై ఉమ్మి వేయడం అంటే నీ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకోవడమే..పాలకుల అహంకారానికి, ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరిగే యుద్ధంలో ఎప్పుడూ ఆత్మాభిమానమే గెలుస్తుంది..అధికారం పోయాక నీ మొహం చూసి ప్రజలు ‘ఛీ’ అనకుండా ఉండటమే అసలైన విజయం..ప్రత్యర్థులను హింసిస్తే చరిత్ర నిన్ను ఒక ‘రాజకీయ విలన్’గానే ముద్రవేస్తుంది అన్నారు.
Also Read:సజ్జనార్‌పై హరీశ్‌రావు సీరియస్

