ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం శంభాల మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో సక్సెస్ రుచి చూసిన ఆది సాయికుమార్..ఓటీటీలోనూ సత్తాచాటాడు. ఉగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్‌లో అర్చనా అయ్యర్ కీలక పాత్రలో నటించారు.
జనవరి 21, 2026న డిజిటల్ వేదికపై విడుదలైన ఈ సినిమా, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో మరో గొప్ప రికార్డును నమోదు చేసింది. కేవలం 11 రోజుల్లోనే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు సాధించడం విశేషం. ఇది ప్రేక్షకుల నుంచి సినిమాకు లభించిన ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.
ఈ సినిమా హిందీ వెర్షన్ ఇంకా విడుదల కాలేదు. అది ఓటీటీ ప్లాట్‌ఫాంలపైకి వచ్చిన తర్వాత, ప్రస్తుత స్పందనకన్నా మరింత మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. హిందీ వెర్షన్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
Also Read:కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్
ఈ చిత్రంలో స్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ, లక్ష్మణ్ మీసాలా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

