మల్లన్నకు షాక్….టీఆర్ఎస్‌లోకి దాసరి భూమయ్య

58
dasari

తీన్మార్ మల్లన్నకు గట్టి షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్న టీంలో సభ్యుడిగా ఉన్న రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య టీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

రెండేళ్ల క్రితం పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన భూమ‌య్య‌ తదనంతరం చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న టీంలో సభ్యుడిగా పనిచేశారు. పోలీసు శాఖలో ఎస్ఐ, సీఐగా పనిచేసి.. హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాలతో మంచి సంబంధాలున్నాయి.

ఈ సందర్బంగా దాస‌రి భూమయ్య మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. అయన చెప్పుకునే భావజాలానికి, బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? అని దాస‌రి భూమ‌య్య‌ ప్రశ్నించారు. బీజేపీ నిరుద్యోగాన్ని పెంచుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని, అంబానీ అదానీల చేతిలో దేశాన్ని పెడుతోందని ఆరోపించారు.