బిగ్ బాస్ 5…నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్

81
master

బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ 5 విజయవంతంగా నాలుగువారాలు పూర్తి చేసుకుంది. 4వ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎలిమినేషన్‌లో ఉన్న 8 మందిలో ఒక్కొక్కరు సేఫ్ అవుతూ వస్తుండగా చివరగా లోబో, నటరాజ్ మాస్టర్ మిగిలారు.

వీరిద్దరి ఎలిమినేషన్‌లో భాగంగా హార్ట్ రేట్ పెంచే విధంగా ట్విస్ట్ ఇచ్చారు నాగ్. కాసేపు ఉత్కంఠ అనంతరం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగార్జున. దీంతో నటరాజ్ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి ఆపుకోలేక పోయారు.

నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు సైతం ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో ఉన్ నఅనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. ముఖ్యంగా లోబో, మానస్, ప్రియాంక మాస్టర్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుపెట్టారు.