సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: దర్శనం మొగిలయ్య

74
mogulaiah
- Advertisement -

నల్లమల ముద్దు బిడ్డ దర్శనం మొగిలయ్యకు అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నతమైన వ్యక్తిత్వాలకు అందించే పద్మశ్రీ అవార్డుకు… మొగిలయ్య ఎంపికయ్యారు. 12 మెట్ల కిన్నెర కళాకారుడిగిగా తెలుగు ప్రజల మనసు దోచుకున్నారు. గ్రామగ్రామానా తిరిగి… అందంగా ముస్తాబు చేసిన కిన్నెర వాయిద్యంతో అందరినీ అలరించారు.

ఆయన ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సత్కారాలు అందించింది. పింఛన్‌తో పాటు ఆర్టీసీలో ఉచితంగా ప్రయానం వంటి సౌకర్యాలు కల్పించింది.నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గుట్టరాయిపాకులలో పుట్టిన మొగిలయ్య… తన తాత, తండ్రి నుంచి కిన్నెరవాయిద్యం నేర్చుకున్నారు. తర్వాత అవుసలికుంటలో స్థిరపడ్డారు. పూట గడవని స్థితిలో… కిన్నెర కళనే నమ్ముకుని… స్కూళ్లలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనకు పద్మశ్రీ దక్కడంతో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. తనకు ఇంతటి గౌరవం దక్కడంతో సీఎం కేసీఆర్‌కు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -