ప్రేమికులరోజు కానుకగా ‘సర్కారు వారి పాట’

50
mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్ర యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. పరుశురామ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి రిపబ్లిక్ డే కానుకగా మేకర్స్ అదిరే ట్రీట్ ఇచ్చారు. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఏప్రిల్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే రిలీజైన‌ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగ‌వంతం చేయ‌నుంది.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించగా ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు

- Advertisement -