టీటీడీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

65
ttd
- Advertisement -

తిరుమలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా టిటిడి అధికారులు నిర్వహించారు.. గోకులంలోని అడిషనల్‌ ఈవో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ జండాను ఎగుర వేసి జండా వందనం సమర్పించారు.. అనంతరం ఉద్యోగులను ఉధ్యేసించి ధర్మారెడ్డి మాట్లాడుతూ… కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాంమని తెలిపారు.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాంమని, 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం భక్తులకు కల్పించాంమన్నారు.

ఇంతవరకు శ్రీవారిని దర్శనానికి నోచుకోని భక్తులకు ప్రత్యేక బస్సులతో తిరుమలకు తీసుకువచ్చి బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి నాడు దర్శనభాగ్యం కల్పించాంమని తేలియజేశారు.. ఇలా 16 వేల మందికి శ్రీవారి దర్శనభాగ్యం దక్కిందన్నారు.. అత్యాధునిక సౌకర్యాలతో 2 వేల గదులను అందుబాటులోకి తీసుకొచ్చాంమని, త్వరలోనే 7500 గదులు అన్ని సౌకర్యాలతో భక్తులకు అందుబాటులో రానున్నట్లు ఆయన తెలిపారు.. రిలయన్స్ సంస్థ సహకారంతో 25 కోట్లతో అలిపిరి మెట్ల మార్గం నిర్మించి భక్తులకు అంకితం చేసాంమన్నారు.

అంతే కాకుండా వర్షం కారణంగా దెబ్బ తిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేసాంమని చెప్పారు.. గో-ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి తిరుమలలో గో ఆధారిత ఉత్పత్తులనే వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.. నూతన పరకామణిలో కౌంటింగ్ విధానాన్ని భక్తులు చూసేలా ఏర్పాటు చేసాంమని,ఎస్వీబిసి హిందీ,కన్నడ ఛానెల్స్ ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు.. యువతకు భగవత్ గీత గుర్తు చేస్తూ పలు కార్యక్రమాలు చేపట్టాంమని ఆయన తెలియజేశారు..

- Advertisement -