కాంగ్రెస్‌కు దానం నాగేందర్‌ గుడ్‌ బై…

316
Danam Nagender
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత,మాజీ మంత్రి దానం నాగేందర్‌…కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖ రాసిన దానం రాజీనామాకు గల కారణాలను వివరించారు. రేపు మీడియా ముందు రాజీనామాకు గల వివరాలను వెల్లడించనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు దానం.

కొంతకాలం క్రితం సీఎం కేసీఆర్‌ని కలవడంతో ఆయన గులాబీ పార్టీలో చేరుతారనే వార్తలు జోరందుకున్నాయి. అయితే, ఈ వార్తలను ఖండించని దానం…కాంగ్రెస్ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దానం టీఆర్ఎస్‌లో చేరడం లాంఛనమే అని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాగం తర్వాత 1999,2004,2009 ఎన్నికల్లో విజయభేరి మోగించారు. గ్రేటర్‌ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా…తన పట్టును నిలుపుకున్నారు.రాజశేఖర్ రెడ్డి,రోశయ్య,కిరణ్ కూమర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.2014 ఎన్నికల్లో బీజేపీ నేత రాంచంద్రారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దానం గ్రేటర్ ఎన్నికల సమయంలో కూడా పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ప్రచారం నిర్వహించక పోవడం పెద్ద చర్చనీయాంశమైంది.

- Advertisement -