చిన్నారుల కోసం ‘స‌మంత’ అక్ష‌య పాత్ర..

278
samanthaa

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఒకరు అక్కినేని స‌మంత‌. తెలుగు, త‌మిళంలో వ‌రుస సినిమాలు చేసుకుంటూ బిజీగా గుడుపుతోంది. స‌మంత పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంద‌నుకున్నారు ఆమె అభిమానులు. కానీ దానికి విరుద్దంగా పెళ్లి అయిన త‌ర్వాత ఆమె ఎక్కువ సినిమాలు చేసుకుంటూ స‌క్సెస్ ను సొంతం చేసుకోటోంది. స‌మంత ఇటు సినిమాల్లో న‌టించ‌డ‌మే కాకుండా ఓ ఆశ్ర‌మంను కూడా నడుపుతోంది. ఆ ఆశ్ర‌మం ద్వారా చాలా మంది అనాధ‌ల‌కు స‌హాయం అందిస్తోంది.

samantha

త‌ను సంపాదించే దాంట్లో ఎంతో కొంత మ‌నీని ఆశ్ర‌మంకు ఖ‌ర్చు చేస్తోంది. దాంతోపాటు చాలామందికి చాలా ర‌కాలుగా స‌హాయం అందిస్తోంది స‌మంత‌. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో అంద‌రికంటే ముందు ఉంటుంది. అంతేకాకుండా ఇత‌రులు కూడా పాలుపంచుకోవాల‌ని ప‌లు సందేశాలు ఇస్తోంది. తాజాగా స‌మంత చిన్న‌పిల్ల‌ల కోసం మ‌రో కొత్త ఐడియాను సృష్టించింది.

samantha_

చిన్నారుల‌కు పౌష్టికాహారం ఇస్తూ ఫోటో తీసుకుని త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. ఈసంవ‌త్స‌రం త‌మ కుటుంబం వంద మంది పేద చిన్నారుల‌కు ఒక పూట భోజ‌నం అందిస్తోంద‌ని తెలిపింది. ఒక్క మ‌నిషి సంవ‌త్సారానికి 950రూపాయ‌లు విరాళంగా ఇస్తే ఆచిన్నారులు రోజు రుచిక‌ర‌మైన భోజ‌నం అందించ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఎవ‌రైనా స‌హాయం చేయాల‌నుకుంటే అక్ష‌య పాత్ర ఆర్గ‌నైజేష‌న్ ద్వారా సాయం చేయ‌వ‌చ్చ‌ని ట్వీట్ చేసింది. https://www.akshayapatra.org/isharemylunch ఈ వెబ్ సైట్ ద్వారా ఎవ‌రైనా సాయం చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. స‌మంత తీసుకున్న ఈనిర్ణ‌యానికి ప‌లువురు నెటిజ‌న్ల అభినంద‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.