రాజీనామా వార్తలపై దానం

6
- Advertisement -

రాజీనామా వార్తలపై స్పందించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రాజీనామా ప్రచారం వాస్తవం కాదని.. తానంటే గిట్టనివాళ్లు ఇలా తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు దానం. రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన వెల్లడించారు.

సోషల్ మీడియాలో దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన దానం నాగేందర్ ప్రచారాన్ని ఖండించారు.

Also Read:Kantara:రూ.200 కోట్లకు చేరువలో!

- Advertisement -