Bihar:బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

10
- Advertisement -

ఇవాళ సాయంత్రం బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు కూడా ఉప ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించనున్నట్లు తెలుస్తున్నది.

243 స్థానాలు కలిగిన బీహార్‌ అసెంబ్లీకి నవంబర్‌ 22తో గడువు ముగియనుంది. బీహార్‌లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. సెప్టెంబర్‌ 30న ఓటర్ల జాబితాను ప్రచురించింది.

ఇకపై ఏ పోలింగ్‌ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండరు. ప్రస్తుతం 1,500 మంది ఓటర్లు ఉంటున్నారు. తాజా సవరణతో బీహార్‌లో ప్రస్తుతమున్న 77,895 పోలింగ్‌ కేంద్రాలు 90,712కి పెరుగనున్నాయి.

Also Read:Kantara:రూ.200 కోట్లకు చేరువలో!

- Advertisement -