పాక్‌ను చిత్తు చేసిన టిమిండియా

6
- Advertisement -

పాకిస్థాన్‌ను చిత్తు చేసింది భారత మహిళల జట్టు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యఛేదనలో 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది పాక్. దీంతో 88 పరుగుల తేడాతో పాక్ ను మట్టి కరిపించింది భారత్. సిద్రా ఆమిన్ (81) పోరాటం చేసినా మరో ఎండ్ లో సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు ప్రతికా రవల్ (31), మంధాన (23),హర్లిన్ డియోల్ (46) చక్కటి ఇన్నింగ్ ఆడారు. చివరలో రిచా (35) మెరియగా భారత్ భారత్ 247 పరుగులు చేసింది.

Also Read:Kantara:రూ.200 కోట్లకు చేరువలో!

- Advertisement -