హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పలు ప్రాంతాల్లో పర్యటించారు.
బేగంపేట, పరెడ్ గ్రౌండ్,సికిందరాబాద్, కవాడిగూడ, అర్ టీ సీ క్రాస్ రోడ్,ఇందిరా పార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. 48 గంటలుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతుందని తెలిపిన దాన కిషోర్ ..
ఎండ లేదు.. రోడ్లు డ్రై అవడానికి ఛాన్స్ లేదన్నారు.
తడి గా ఉన్న రోడ్లను పూడ్చడానికి ప్రత్యేక మెటీరియల్, షెల్ మాక్ బీ.టీ మిశ్రమాన్ని వాడుతున్నామని చెప్పారు.నగరంలోని పరిస్థితులపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించానని చెప్పారు.
భూమి బాగా తడిసి పోవటంతో రోడ్డుపై నీరు నిలిచిపోయిందని…ఓ వైపు వర్షం మరోవైపు వాహనాలు కంటిన్యూగా వెళ్తుండటంతో రోడ్లు పాడవుతున్నాయని చెప్పారు. ప్రతి జోన్ కు ఇద్దరు సీనియర్ అడికారులను మానీటరింగ్ అధికారులగా నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని..150 ఎమర్జెన్సీ బృందాలు పనులు చేస్తున్నాయని చెప్పారు..