దళిత బంధుపై 26న సదస్సు..

154
kcr cm
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు పైలట్ నియోజకవర్గంగా హుజురాబాద్‌ను ఎంచుకోగా ఈ నెల 26న ప్రగతి భవన్లో హుజురాబాద్ ప్రజలతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే ఈ సమావేశంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) కలిపి 412 మంది దళిత పురుషులు, మహిళలు పాల్గొంటారు.

దళితబంధు పథకం రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పునకు ఏ విధంగా దోహదపడుతుంది? పైలట్‌ ప్రాజెక్టును హుజూరాబాద్‌ నియోజకవర్గంలో చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎలా లీనమై పనిచేయాలి? అనే దానిపై సీఎం కేసీఆర్ అవగాహన కల్పించనున్నారు.

- Advertisement -