కేటీఆర్ బర్త్ డే..మొక్కలు నాటండి: చిరు

99
ktr

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మూడు కోట్ల మొక్కలను నాటనున్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నారు.

ఇక కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ముందస్తుగా విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కు థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్…ప్రకృతిని మనం కాపాడుతేనే అది మనల్ని కాపాడుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.