కిషన్‌ రెడ్డికి షాక్..యాత్రను అడ్డుకున్న దళితులు

149
kishan reddy
- Advertisement -

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి షాక్ తగిలింది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జన ఆశీర్వాద యాత్రను చేపట్టారు కిషన్ రెడ్డి. ఇందుకోసం ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేయగా…వారికి ఊహించని షాక్ తగిలింది.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రను అడ్డుకున్నారు దళిత సంఘాల నేతలు. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ యాత్రను అడ్డుకోవడంతో పాటు పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్ధానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని చక్కబెట్టేందుకు ఆందోళన కారులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇక ఒక్కసారి దళిత సంఘాల నేతలు యాత్రను అడ్డుకోవడంతో బీజేపీ నేతలు షాక్‌కు గురయ్యారు.

- Advertisement -