రంగారెడ్డి జిల్లా చందన్‌వల్లి ఇండస్ట్రియల్ పార్కులో జపాన్‌కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్‌కు, నికోమాక్ తైకిషా కంపెనీల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లేచి నిలిచి జపాన్ సత్తా చాటిందన్నారు. మన దేశంలో ప్రతి ఇంట్లో ఆ దేశానికి చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఆ దేశానికి చెందిన మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. డైఫుకు కంపెనీ దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు. మూడు నెలల్లోనే పరిశ్రమ ప్రారంభం కానుందని వెల్లడించారు. చందన్‌వల్లికి వెల్‌స్పన్, మైక్రోసాఫ్ట్ సహా అనేక సంస్థలు వస్తున్నాయన్నారు.
Also Read:మూత్రవిసర్జనలో మంట వస్తోందా..!
డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్, నికోమాక్ తైకిషా కంపెనీల ఏర్పాటుతో సుమారు 1600-2000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నికోమాక్ తైకిషా లిమిటెడ్ కంపెనీకి వందేండ్లకుపైగా చరిత్ర కలిగి ఉంది. నిర్మాణ రంగానికి చెందిన క్లీన్ రూం ఉత్పత్తులను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ డా. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read:చంద్రయాన్-3 విజయవంతం..నెక్స్ట్ టాస్క్ అదే!