సినిమా షూటింగ్ మొదలుకుని విడుదల వరకూ ఎన్నో ఇబ్బందులు మరెన్నో కేసులు వెంటాడాయి. సినిమాపై ఆంక్షలుపెట్టి.. చంపేస్తాం అంటూ చాలా ఇబ్బందులకు గురి చేసినప్పటికి అన్నింటిని ఎదుర్కుని భారీ భద్రత నడుమ విడుదలైన చిత్రం పద్మావత్. విడుదల అనంతరం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది పద్మావత్ మువీ. సంజయ్ లీలా మార్క్ సినిమాపై కనిపించింది. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ పోషించిన అల్లావుద్దీన్ ఖీల్జీ పాత్రకు ఓ గొప్ప పురస్కారం వరించింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైంది. దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికైనట్లు అవార్డు సభ్యులు తెలిపారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ నటనేంటో పూర్తిగా అర్థమవుతోంది. సంజయ్ లీలా దర్శకత్వ ప్రతిభ, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే అద్భుతమైన నటన తోడై ఈ సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టాయి.