ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాచేపల్లి మృగాడు రామ సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ సుబ్బయ్య విషయం భయటకి తెలియడంతో పరారయ్యాడు. అప్పటినుంచి సుబ్బయ్య కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు.
15 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తుండగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నా అని బంధువులకు చెప్పిన సుబ్బయ్య తన ఫోను స్వీచ్ ఆఫ్ చేశాడు. తాజగా ఇవాళ దైదాలోని అమరలింగేశ్వర ఆలయం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్న ఓ వ్యక్తి మృత దేహం లభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అది సుబ్బయ్య మృతదేహమని తేల్చినట్లు సమాచారం.
సుబ్బయ్యను పట్టుకునేందుకు పోలీసులు కృష్ణానది పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో అణువణువు గాలించారు. మరోవైపు బాధితురాలికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. 5 లక్షల పరిహారం అందించడంతో పాటు బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.
మరోవైపు దాచేపల్లిలో నిన్నటి ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని హోంమంత్రి చినరాజప్ప పరామర్శించారు.