గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట- మంత్రి

141
- Advertisement -

ఎంపీపీ ఉంగ ప్రవీణ అధ్యక్షతన శనివారం శ్రీకాకుళం జిల్లా పలాస మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం జరిగింది. తొలి సారిగా జరిగిన ఈ సమావేశానికి మండలంలో గల మండల పరిషత్ సభ్యులు, సర్పంచ్‌లు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి సీధిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను అరికట్టేందుకు డయాలసిస్ కేంద్రాలతో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని మరోమారు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు.

గ్రామాల్లో త్రాగునీటి అవసరాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని.. వాటిని సర్పంచ్‌లు వినియోగించుకొని గ్రామాల్లో త్రాగునీటి అవసరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ తమ గ్రామాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మచ్చ రత్నాలు, ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు పి.వి. సతీష్, పైల చిట్టి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -