డి.వి సినీ క్రియేషన్స్‌కే ‘తారామణి’ రైట్స్‌

193
- Advertisement -

విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్న డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తమిళ చిత్రం తారామణి సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. అండ్రియా, అంజలీ, వసంత్ రవి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మూడు జాతీయ అవార్డులను దక్కించుకున్న చిత్రం తంగ మీన్ గల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రామ్ దర్శకత్వంలో డా.ఎల్.గోపీనాథ్, రామ్, జె.సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం మంచి పోటీ నెలకొన్న నేపథ్యంలో డి.వెంకటేష్ ఫ్యాన్సీ రేటుతో తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.

జీవా, కాజల్ అగర్వాల్ నటించిన `ఎంత వరకు ఈ ప్రేమ` చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంతో పాటు తెలుగులో తారామణి చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తారామణి సినిమా తెలుగు టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత డి.వెంకటేష్ తెలియజేశారు.

Taramani

- Advertisement -