24న కాంగ్రెస్‌లోకి డీఎస్‌..!

53
ds
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 24న ఢిల్లీలో సొంతగూటికి చేరనున్నారు డీఎస్.ఇటీవల సోనియాగాంధీతో డీఎస్ సమావేశం కావడంతో అప్పటినుండే ఆయన హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కొంతమంది సీనియర్లు డీఎస్‌ రాకను వ్యతిరేకించినప్పటికి అధిష్టానం మాత్రం డీఎస్‌ను పార్టీలోకి తీసుకుంటుండం విశేషం.

2016లో టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు డీఎస్. డీఎస్ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -