D Srinivas: కాంగ్రెస్‌లో చేరికపై డీఎస్ క్లారిటీ…

50
- Advertisement -

కొంతకాలంగా మాజీ మంత్రి నిజామాబాద్ జిల్లాకు చెందిన డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై స్పందించారు డీఎస్. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదని తన పెద్ద కొడుకు సంజయ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సంజయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన డీఎస్…తన ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్‌కు వెళ్లి సంజయ్‌ని ఆశీర్వదిస్తానని చెప్పారు. చిన్న కొడుకు అర్వింద్ ఎంపీగా ప్రజాసేవలో ఉన్నాడని వారు ఎక్కడున్నా వారికి తన ఆశీస్సులుంటాయని తెలిపారు. పార్టీలు వేరైనా తన కుమారులు ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగారు డీఎస్. వైఎస్‌ – డీఎస్ ఇద్దరిది సక్సెస్ కాంబో. రెండు సార్లు కాంగ్రెస్‌ని అధికారంలోకి తేవడంలో వీరిద్దరిది కీ రోల్. రాష్ట్ర విభజన తర్వాత డీఎస్‌…బీఆర్ఎస్‌లో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -