దేశాన్ని మరో తుపాన్ తాకనుంది. ఇప్పటికే తౌక్టే తుపాన్‌తో పలు రాష్ట్రాలు అతలాకుతలం కాగా తాజాగా బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుండగా అది ఈనెల 24న తుపానుగా మారనుంది.
దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగాను ఉంటుందని…ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.
మరోవైపు నైరుతి రుతుపవనాల తొలి అడుగు అండమాన్ సముద్రంలోకి ప్రవేశంతోనే పడుతుంది. శుక్రవారం ఈ రుతుపవనాలు దక్షిణ, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రెండు రోజుల్లో నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించనున్న ఈ రుతుపవనాలు జూన్ 5వ తేదీనాటికి వచ్చే అవకాశం ఉంది.