దేశంలో 24 గంటల్లో 2,57,299 కరోనా కేసులు…

68
covid 19

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 2,57,299 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 4,194 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కి చేరగా 2,30,70,365 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 2,95,525 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 29,23,400 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటి వరకు 32,64,84,155 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.