IMD:ముంచుకొస్తున్న మోచా..తీర ప్రాంతాలకు ఆలెర్ట్‌..!

64
- Advertisement -

అకాల వర్షాలతో అన్నదాతలు అల్లాడిపోతున్నవేళ మరో పిడుగులాంటి వార్త వచ్చేసింది. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుఫాను ముప్పు పొంచి ఉందన భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను బలపడే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేసింది. మత్స్య కారులు సముద్రంలోకి వెళ్లద్దొని హెచ్చరించింది.

మే 6నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంఓ వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ మరుసటి రోజు ఆదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9న తుఫానుగా మారే అవకాశముందని తెలిపింది. ఈ తుఫాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశాముందని అంచానా వేస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర వివరించారు.

Also Read: NEWDELHI:రేపే బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం

ఈ తుపానుకు మోచా అని పేరు పెట్టారు. యెమెన్‌లోని పోర్టు నగరం మోచా పేరుమీదుగా పేరు పెట్టినట్లు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుపాన్ దిశ గురించి కచ్చితమైన సమాచారం లభిస్తుందని అన్నారు. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని…మత్స్య కారులు వేటకు వెళ్లదని హెచ్చరించారు.

Also Read: కేసీఆర్ రియల్ హీరో..వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

- Advertisement -