అడపిల్లల్ని వేదించడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం. పబ్లిక్‌లో వెళుతూ ఉన్న అమ్మాయిల వెంట పడి వెకిలి వేషాలు వేస్తే.. వారి కఠిన శిక్షలు తప్పవు. హైదరాబాద్ సహా పలు నగరాల్లో షీ టీమ్ లు వెంటాడి వేటాడుతున్నాయి. పోకిరీల భరతం పడుతూ కటకటల్లో వేస్తున్నారు. షీటీమ్ లు వచ్చాక పరిస్థితి మారిపోయింది. పోకిరీలు అమ్మయిల వంక చూడాలంటేనే వణికిపోతున్నారు. మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా పోలీసు విభాగం వినూత్నంగా అలోచించి అడుగులు వేస్తోంది. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీటీమ్ లు పని చేస్తున్నాయా లేదా? అన్నది ప్రజలకు తెలిసేదెలా? అవగాహన కోసం నటి జయసుధతో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమం చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. జయసుధతో ఓ లఘు చిత్రాన్ని చేయించి వదిలింది షీ టీమ్ విభాగం. ఈ వీడియోలో కన్న కొడుకు అయినా వదలని జయసుధ నటనకు, తెలంగాణ పోలీసుల పనితీరుకు జనాల నుండి మంచి స్పందన వస్తోంది. మరి అలస్యం ఎందుకు ఈ వీడియోను మీరూ వీక్షించండి.!