కరక్కాయ బాధితులకు నష్టపరిహారం : సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

32
karakkaya
- Advertisement -

కరక్కాయ బిజినెస్ చీటింగ్ కేసులో 12 మంది బాధితులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెక్కులను అందజేశారు. 2018కి ముందు కంపెనీ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో పెట్టుబడిపై అధిక రాబడుల వాగ్దానాలతో బాధితులను ఆకర్షించింది. కంపెనీ పెట్టుబడిదారులను ఒప్పించి కిలో కరక్కాయను రూ. 1,000 కొనుగోలు చేయించి మరియు దానిని పౌడర్ తయారు చేసిన తర్వాత కిలోకు రూ.1,300గా నిర్ణయించడం వల్ల పెద్ద మొత్తంలో, ఎక్కువ మంది దీనిలో పెట్టుబడులు పెట్టారు. యూట్యూబ్, పత్రికల్లో ప్రకటనలు గుప్పించడంతో అనతికాలంలోనే ఈ కరక్కాయల పొడి కూకట్ పల్లి అంతా వ్యాపించింది. కరక్కాయల పొడిని ఆయుర్వేద ఔషధాల్లో వాడతారని, తీసుకెళ్లిన కరక్కాయలను తిరిగి ఇవ్వకపోతే నష్టపోతామనే రూ. 1000 డిపాజిట్ పెట్టామని నిర్వాహకులు చెప్పడంతో అందరూ తేలిగ్గా బుట్టలో పడ్డారు. కేసు నమోదు చేసిన తర్వాత విచారించిన కోర్టు 423 మంది కస్టమర్ల నుండి సుమారు రూ.3.75 కోట్లు వసూలు చేసి వారిని మోసం చేసినట్లుగా గుర్తించారు. మోసానికి గురైన 281మంది బాధితులను గుర్తించిన తర్వాత కోర్టు అమోదంతో బాధితులకు తిరిగి చెక్కుల రూపంలో అందజేశారు.

- Advertisement -