రాజాసింగ్‌ పై పీడీ యాక్ట్‌

28
cv
- Advertisement -

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ కింద నమోదు చేసినట్టు సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. మంగళహట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ నమోదైందన్నారు. తరచు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. మత ఘర్షణలు చోటు చేసుకునేలా ఆయన ప్రసంగాలు ఉన్నాయి. 22వ తేదీన ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో విడియోను పోస్టు చేశారు. ఆ వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించింది. ఈనెల 23న ఈ కేసుల్లో రాజాసింగ్‌ ను ఆదుపులోకి తీసుకున్నాం మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజాసింగ్‌ మీడియాకు ప్రకటించారు. మత విద్వేష ప్రసంగాల వల్ల తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ప్రజలందరూ బయభ్రాంతులకు గురయ్యారు. వ్యాపార సముదాయాలలు మూతపడ్డాయి. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101క్రిమినల్‌ కేసులు 18కమ్యూనల్‌ కేసులు నమోదయ్యాయి. అని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

రాజాసింగ్‌ ఓ వ‌ర్గంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో రెండు రోజుల క్రితం మంగ‌ళ్‌హాట్ పోలీసులు నాంప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ కోర్టు విధించింది. దీన్ని రాజాసింగ్ తరపు న్యాయ‌వాది కోర్టులో స‌వాల్ చేశారు. 41 సీఆర్‌పీసీ కండిషన్ ను పోలీసులు పాటించలేదని రాజాసింగ్ తరపు లాయర్ కోర్టులో వాదించారు. దీంతో రాజా సింగ్ రిమాండ్ ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాజా సింగ్ ను విడుదల చేయాలని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ‌ర్గంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టికే రాజాసింగ్‌కు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. రాజాసింగ్ అరెస్టు నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

- Advertisement -