కలలు నిజం అవుతాయి: దినేష్

115
dk
- Advertisement -

ఎట్టకేలకు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తిక్‌ కోరిక నెరవేరింది. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌ చోటు దక్కించుకున్నారు దినేష్. జట్టులో తన పేరు ఉండటంతో ‘కలలు నిజం అవుతాయి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అంతా అయిపోయిందనుకున్న తరుణంలో ఐపీఎల్‌ పుణ్యమా అని టీమిండియాలో చోటు దక్కించుకున్న 37 ఏళ్ల దినేష్‌… పునరాగమనం చేసిన తొలి సిరీస్‌లోనే తొలిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో భారత్ తరపున టీ20 ప్రపంచకప్‌ ఆడాలని కోరిక అని తెలపగా ఇప్పుడు ఆ కల నెరవేరడంతో డీకే ఆనందానికి హద్దులేకుండా పోయింది.

- Advertisement -