కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్‌..

341
cs somesh
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఆరోగ్య కార్యదర్శి S.A.M.రిజ్వీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డితో కలిసి కోఠి ENT ఆసుపత్రిని సందర్శించి, పేషంట్లతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ పేషంట్లకు చేస్తున్న శస్త్రచికిత్సలు, అందిస్తున్న చికిత్సలను వైద్యులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి ENT ఆసుపత్రిని సందర్శించి, ప్రతి వార్డుకు వెళ్లి పేషంట్లకు అందిస్తున్న వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు. ఉత్తమ చికిత్సను అందించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎవరూ భయపడవద్దని కోరారు.

హైదరాబాద్‌లోని కోఠి ఇ.ఎన్‌.టి హాస్పిటల్ ను బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం నోడల్ హాస్పిటల్‌గా గుర్తించి, 250 పడకలతో తగిన సౌకర్యాలు, మెడిసిన్స్ ను అందుబాటులో ఉంచినట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రతి రోజు, ఈ ఆసుపత్రిలో 20 శస్త్రచికిత్సలు నిర్వహించబడుతున్నాయని మరియు శస్త్రచికిత్సలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇది కాకుండా సరోజినిదేవి కంటి హాస్పిటల్ లో కూడా చికిత్సలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఈ పర్యటనలో CM OSD గంగాధర్, టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి, మేజేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ENT హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. శంకర్ ఇతర అధికారులు ఉన్నారు.

- Advertisement -