కరోనా వ్యాక్సిన్‌….గ్లోబల్ ప్రీబిడ్ మీటింగ్

159
covid
- Advertisement -

కోవిడ్ వాక్సిన్ గ్లోబల్ టెండర్ల ప్రీబిడ్ మీటింగు జరిగింది. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ వీ బహుళజాతి కంపెనీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వచ్చే 6 నెలల్లో కోటి టీకాలు సమకూర్చుకునేందుకు టీఎస్ఎంఐడీసీ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. టెండర్ల దాఖలుకు వచ్చేనెల 4 తేదీ వరకు గడువుంది. ఈ నేపథ్యంలో కంపెనీల సంశయాలను నివృత్తి చేసేందుకు వర్చువల్ పద్దతిలో ప్రీబిడ్ మీటింగ్ జరిగింది

. టీకాల టెండర్లకు సంబంధించిన సందేహాలను ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వం ముందు ప్రస్తావించారు. వాక్సిన్ల నిల్వ కోసం కోల్డ్ చెయిన్ ఏర్పాట్లు, గడువు, నిబంధనలు, చెల్లింపుల విధానం తదితర అంశాలపై స్పష్టత కోరారు. వాళ్ళ సందేహాలను ప్రభుత్వ అధికారులు నివృత్తి చేశారు.

యూకేకు చెందిన ఆస్ట్రాజెనికా, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ సంస్థల ప్రతినిధులతోపాటు కేంద్రప్రభుత్వ అధికారులు, ఫార్మారంగ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రీబిడ్ మీటింగులో పాల్గొన్నారు. మనదేశానికి చెందిన భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ ల నుంచి ఇప్పటికే టీకాలు కొనుగోలు చేస్తున్నందున ఆ కంపెనీలకు అన్ని విషయాలపై అవగాహన ఉందనీ, అందుకే అవి ప్రీబిడ్ సమావేశంలో పాల్గొనలేదని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.

- Advertisement -