ఉద్యోగుల విభజనపై సీఎస్ సోమేశ్ సమీక్ష..

31
cs

వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియపై సమీక్షించారు. అన్ని కేడర్ ఉద్యోగుల నుంచి ఐచ్చికాలు తీసుకోవడంతో పాటు సీనియార్టీ జాబితాను కూడా సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.

ప్రక్రియ పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సీఎస్ తెలిపారు. ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు సీఎస్ సోమేశ్ కుమార్.