రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్ లను అప్రమత్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వరంగల్, ఖమ్మం జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాలలో నీటి ప్రవాహం,నీరు నిలిచే అవకాశం ఉంది. భారీ వర్షాలతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి ఆస్తి,ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నందున అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
ప్రాజెక్ట్ లు, రిజర్వాయర్ లు ఓవర్ ప్లో వలన లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయ్యే అవకాశం ఉంది కనుక ఆయా ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టర్ లు,ఎస్పీలు ,జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి ప్లడ్ ప్రోటోకాల్‌ను పాటించి తగు సూచనలు ,సలహాలు చేయాలని సీఎస్ సూచించారు. ప్రత్యేకంగా లో లెవల్ బ్రిడ్జ్,కాజే వే లపై పాదచారులు నడవకుండా నిషేధం చేయాలి. దీనితో ప్రాణ నష్టం జరుగకుండా ఉంటుంది. భారీ వర్షాలతో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎప్పటికిప్పుడు రిపోర్ట్ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.