- Advertisement -
రాష్ట్రంలో నెలకొన్న భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన సీఎస్.. ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ప్రతీ రోజు 20 శాతం చొప్పున పెండింగ్ కేసులన్నీ పరిష్కరించాలని ఆదేశించారు. జూన్ 10 రైతు బంధుకు కటాఫ్ తేదీ కావడంతో ఈ లోపు అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక 15వ తేదీ నుంచి రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ ప్రారంభించి 25వ తేదీలోగా పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ కానుండగా పార్ట్–బీ (ధరణిలోని నిషేధిత భూముల జాబితా) నుంచి పార్ట్–ఏ లోకి చేరిన భూములకు సైతం రైతుబంధు వర్తింపజేయాలని ఆదేశించారు.
- Advertisement -