‘క్రష్’టీజర్.. చూస్తే తట్టుకోలేరు..!

285
Crrush

టాలీవుడ్‌ డైరెక్టర్ రవిబాబు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రష్’. ఈ సినిమాని రవిబాబు తన హోమ్ బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పర్రీ పాండే, శ్రీ సుధారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘ఫస్ట్ పీప్’ పేరుతో ఓ టీజర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ వీడియోతో సినిమాపై ఆసక్తి పెంచేసాడు రవిబాబు. ఈ సినిమా అంతా పూర్తిగా శృంగారభరితంగానే ఉండబోతుందని టీజర్‌తోనే చెప్పేసాడు రవిబాబు. పూర్తిగా అడల్ట్ కామెడీ.. అలాంటి జోకులతోనే నింపేసాడు ఈ దర్శకుడు. కెరీర్‌లో తొలిసారి ఇలాంటి అడల్ట్ కామెడీ చేసాడు రవిబాబు. అయితే ఈ టీజర్ చూసిన తర్వాత చాలా మంది మాత్రం రవిబాబు ఇలాంటి సినిమా చేసాడు అంటూ షాక్‌కు గురైయ్యారు.

Crrush Telugu Movie First Peep | Ravi Babu | Abhay Simha | Ankita Manoj | Telugu FilmNagar