కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్ కొడుకు..

312
kcr
- Advertisement -

తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఓ పాఠ్యాంశంగా చేర్చడంపై నందమూరి కుటుంబం సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తెలుసుకోవాల్సిన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం నిజంగా మా కుటుంబం మొత్తానికి ఆనందంగా ఉంది. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి తరపున సీఎం కేసీఆర్ గారికి మరియు తెలంగాణ మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటూ నందమూరి రామకృష్ణ ఒక లేఖలో పేర్కొన్నారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర తరతరాల విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది. ఆయన జీవితంలోని క్రమశిక్షణ, నిజాయతీ తదితరాలను గురించి ఈ తరం విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదరికం నుంచి వచ్చి, పేదరికాన్ని నిర్మూలించేందుకు ఆయన చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకం. సమాజంలో అసమానతలు తొలగాలని ఆయన ఎంతో శ్రమించారు. నేటి తరం బాలలు, రేపటి భావి భారత పౌరులుగా మారే దశలో ఎన్టీఆర్ జీవిత పాఠం వారికి మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు అని నందమూరి రామకృష్ణ తెలిపారు.

- Advertisement -