2019లో 23 శాతం ఉన్న క్రైమ్ రేట్ 2021లో 49 శాతానికి పెరిగిందన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. 2021 హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనువల్ క్రైమ్ రౌండప్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన సీపీ…హైదరాబాద్ కమిషనరేట్ లో ఈ ఏడాది 20వేల 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితులకు శిక్షలు పడేలా పర్సన్టేజ్ పెంచాం అని…ఈ సంవత్సరం గాంజా,డ్రగ్స్ ముఠాల పై స్పెషల్ ఫోకస్ పెట్టాం అన్నారు.
2వేల 74 కేజీల గంజాయి ,2.5 లీటర్ల హాష్ ఆయిల్ ,34 గ్రాముల కొకైన్ సీజ్ చేశాం అని వెల్లడించారు. ఈ ఏడాది డ్రగ్స్ లో 246 కేసులు నమోదు చేశామని…వివిధ సంస్కరణల్లో బాగంగా సిటీ పరిధిలో 633 కమ్యూనిటీ CC కెమెరాలు 70 వేల 574 నేను సైతం కెమెరాలు, 194 CC కెమెరాలు ఏర్పాటు చేశాం అన్నారు. హైదరాబాద్ లో మొత్తం 4లక్షల 40 వేల299 CC కెమెరాలు ఉన్నాయని చెప్పారు.
జాబ్ కనెక్ట్ కార్యక్రమంతో 1889 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిచాం అని తెలిపిన సీపీ..సిటీ పరిధిలో ఈ సంవత్సరం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. షి టీం లోని మహిళ సిబ్బందికి 27 షి బైక్స్ ను అందించామని…కేసులు ఛేదించడంలో ఫోరెన్సిక్ పరికరాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
సిటీ పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి, పొక్సో యాక్ట్ కిందా 2019 లో 339 కేసులు నమోదు కాగా, 2021 లో 357 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఈ ఏడాదిలో వరుసగా నేరాలకు పాల్పడ్డ 205 మంది పై PD యాక్ట్ పెట్టాం అన్నారు.నగరం లో రేప్ కేసులు పెరిగాయి, 2019 లో281 కేసులు నమోద్ కాగా 2021 లో 328 కేసులు రిపోర్ట్ అయ్యాయని చెప్పారు. .
ట్రాఫిక్ ఎన్ఫోర్స్ మెంట్ ద్వారా ఈ ఏడాది 70లక్షల 3వేల 12 ట్రాఫిక్ ఉలంఘన కేసులు నమోదు చేశామన్నారు. 2021 లో డ్రంకెన్ డ్రైవ్ 25వేల 453 కేసులు నమోద్ కాగా 206 మందిని జైల్ కు పంపామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ ద్వారా 10 కోట్ల 49 లక్షల 61 వేయి జరిమానా విధించాం అని..డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 25 మంది డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేయించాం అన్నారు.