ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి: ఎర్రోళ్ల

43
harishrao

ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు టీఎస్‌ఎమ్ఎస్‌ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన ఎర్రోళ్ల..గతంలో ఎస్సి ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గా సమర్ధవంతంగా పనిచేశాను…ముఖ్యమంత్రి కేసీఆర్ నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్పొరేట్ కు ధీటుగా ప్రభత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్నాయన్నారు. తాగు ,సాగు నీటికి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్ట్ లను నిర్మించారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానని…మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.