రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలు..

45
- Advertisement -

భారత స్టార్ క్రికెటర్‌ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టగా దాదాపు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు పంత్.

ఇవాళ ఉదయం ఈ సంఘటన జరుగగా ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో మండుతున్న కారు అద్దాల్ని పగులగొట్టి బయటకు దూకారు పంత్.
పంత్‌కు స్వ‌ల్పంగా గాయాలు కాగా డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పంత్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని… రాత్రి ప్ర‌యాణం వ‌ల్ల .. ఓ ద‌శ‌లో నిద్ర మ‌త్తులో ప్రమాదం జరిగిందని ఉత్త‌రాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో.. రిష‌బ్ పంత్ ఒక్క‌డే కారులో ఉన్నాడని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -