టాలీవుడ్‌ నుండి ‘ఫోర్బ్స్‌’లోకి తొలి వ్యాపారవేత్త..

337
SURESH REDDY KOVVURI
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత వ్యాపారవేత్తల వివరాలను తెలియచేసే పత్రిక ‘ఫోర్బ్స్‌’. నీళ్లు శంఖంలో పోస్తేగాని తీర్థం కాదు అన్నట్టు.. విశ్వవ్యాప్తంగా ప్రచురితమయ్యే ఫోర్బ్స్‌ పత్రికలో విభిన్న రంగాల్లోని వ్యాపారవేత్తల జాబితా ప్రచురిస్తే వచ్చే పాపులారిటీ కూడా అలాంటిదే. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు తమ వివరాలు ఫోర్బ్స్‌ జాబితాలో నమోదు కావాలని కోరుకుంటారు. చాలా అరుదుగా వచ్చే ఈ అవకాశం అతి చిన్న వయసులోనే వ్యాపారవేత్త కొవ్వూరి సురేష్‌రెడ్డికి లభించింది.

వ్యాపార రంగంలోకి ప్రవేశించి ‘క్రియేటివ్‌ మెంటర్స్‌’ అనే సంస్థని స్థాపించిన 13 సంవత్సరాల వ్యవధిలోనే ‘ఫోర్బ్స్‌’ జాబితాలో చేరిన తొలి తెలుగు వ్యాపారవేత్తగా కొవ్వూరి సురేష్‌రెడ్డి ఈ ఘనత సాధించారు. ఇటీవల 30 సంవత్సరాల వయసున్న ప్రతిభగల 30 మందిని ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన విషయం విదితమే. అందులో మన తెలుగువాడు, నటుడు విజయ్‌ దేవరకొండ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాగా, ప్రస్తుతం భారత వ్యాపార వేత్తల విభాగంలో గుర్తింపు పొందిన తొలి తెలుగు యువ కెరటం కొవ్వూరి సురేష్‌రెడ్డి కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడం విశేషం.

ఈ సందర్భంగా ‘క్రియేటివ్‌ మెంటర్స్‌’ అధినేత కొవ్వూరి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ – ”నా జీవితంలో ఊహించని, మరచిపోలేని పరిణామం ఇది, చాలా సంతోషంగా వుంది. అతి చిన్న వయసులో సినీ రంగంలోని అన్ని విభాగాలలో పనిచేసి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన లెజెండరీ సినీ డైరెక్టర్‌, యాక్టర్‌, ప్రొడ్యూసర్‌ యల్‌.వి.ప్రసాద్‌ నేను ఈ స్థాయికి ఎదగడానికి స్పూర్తి. ఆయన ఏ విధంగా కస్టపడి పైకొచ్చారో అదే విధంగా నా చిన్న వయసులోనే ‘క్రియేటివ్‌ మెంటర్స్‌’ యానిమేషన్‌, గేమింగ్‌ మరియు సినీ విభాగాలకు చెందిన స్కూల్‌ ప్రారంభించాను. ఆసియాలోనే తొలిసారిగా కేబుల్స్‌ లేకుండా మోషన్‌ కాప్చర్‌ యానిమేషన్‌ ప్రక్రియ ప్రవేశపెట్టాను.

ఇప్పటి వరకు మా స్కూల్‌ నుండి 3 వేల పైచిలుకు విద్యార్థులు తర్పీదు పొంది సినీ రంగంలో వివిధ విభాగాలలో రాణిస్తున్నారు.2018లో ‘ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం అండ్‌ మీడియా స్కూల్‌’ ను స్థాపించడం జరిగింది. జాతీయస్థాయిలో మంచి బ్రాండ్ వున్నా ప్రసాద్స్ తో ‘క్రియేటివ్‌ మెంటర్స్‌’ కలిసి బిజినెస్ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రసాబ్‌ లాబ్స్‌, ఐమాక్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌గారికి నా చాన్యవాదాలు. ఈ విధం జరగడం యాదృచ్చికమే అయినా నా స్ఫూర్తి ప్రదాత యల్‌.వి.ప్రసాద్‌గారి తనయుడు రమేష్‌ ప్రసాద్‌ ఈ అవకాశం ఇచ్చి నా అభివృద్ధికి మరింతగా దోహదపడటం ఎవరికీ దొరకని అద ష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటె ప్రసాద్స్ వారి వ్యాపారాలన్నీ స్వతంత్రంగా నిర్వహిస్తున్నవే. ప్రసాద్స్ తో కలిసి వ్యాపారం చేసే అవకాశం నా ఒక్కడికే లభించడం విశేషంగా భావిస్తున్నాను.

తాజాగా ప్రచురించిన ఫోర్బ్స్‌ పత్రికలో రేవా విశ్వవిద్యాలయం, నిర్మాణ రంగం నుండి డాక్టర్‌ పి శ్యామారాజు, టాటా గ్రూప్స్‌ – రతన్‌ టాటా, బజాజ్‌ సంస్థ నుండి రాహుల్‌ బజాజ్‌, హెచ్‌.సి.యల్‌ – శివ నాడార్‌, జె.కె.సిమెంట్స్‌ – యదూపాటి సింఘానియా, ఆదిత్య గ్రూప్స్‌ – కుమార మంగళం బిర్లా, హావెల్స్‌ – అనిల్‌రాయ్‌ గుప్తా, మహేంద్ర గ్రూప్స్‌ – ఆనంద్‌ జి. మహేంద్ర… ఇలా 51 మంది వ్యాపారవేత్తల పేర్లు నమోదు చేశారు. అంత మంది అగ్ర వ్యాపారవేత్తల సరసన నా పేరు కూడా నమోదు కావడం రమేష్ ప్రసాద్ గారి ఆశీస్సులు అనుకుంటాను.

నన్ను గుర్తించి తమ జాబితాలోకి చేర్చిన ‘ఫోర్బ్స్‌’ యాజమాన్యానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మే 30న లండన్‌లో బిబిసి వారి సౌజన్యంతో ‘గ్లోబల్‌ బిజినెస్‌ కాంక్లేవ్‌ 2019’ అనే కార్యక్రమం వుంది. ఆరోజు ‘హౌస్‌ అఫ్‌ కామన్స్‌’ అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. అయితే ఈ పత్రికలో ప్రచురించబడిన 51మందిని నామినేటెడ్‌ పర్సన్స్‌గా పరిగణించి, వారిలో 25 మందికి అవార్డులను ఇస్తారు. నాకు గాని ‘హౌస్‌ అఫ్‌ కామన్స్‌’ అవార్డుగాని లభిస్తే ఒక తెలుగువాడిగా గర్వంగా ఫీల్‌ అవుతాను” అన్నారు.

- Advertisement -