దటీజ్ విజయ్ దేవరకొండ..!

610
vijay devarakonda
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకురానుంది. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటించారు.

ఇక విజయ్ నటించిన ఈ మూవీ కోసం యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో బుకింగ్స్ స్టార్ట్ చేసిన కొద్దిగంటల్లోనే టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. విజయ్ స్టామినాను ప్రూవ్ చేసేలా దాదాపుగా ఆన్‌లైన్లో టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. హైదరాబాద్ లో 190 థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్‌ చేయగా 120 థియేటర్లలో టికెట్స్ అయిపోయాయి. మిగిలిన స్క్రీన్స్‌లో దాదాపుగా టికెట్స్  క్లోజ్ అయ్యే పరిస్ధితి నెలకొంది.

గతంలో విజయ్ ఏ సినిమాలకు రానంత రెస్పాన్స్ వరల్డ్ ఫేమస్ లవర్‌కి రావడం పట్ల ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంతో విజయ్ హిట్ కొడతాడో లేదో వేచిచూడాలి.

- Advertisement -