కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం..

294
cm kcr

రాష్ట్ర అభివృద్ధి-ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎవరికి వ్యక్తిగత ప్రధాన్యతలు ఉండరాదని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు.

విస్తృత మేథోమతనం అనేక రకాల చర్చలు.. అసెంబ్లీలో విస్తృత చర్చ.. విషయనిపుణుల సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని సీఎ అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంబిస్తున్న మన దేశంలో ప్రభుత్వం ఎన్నుకున్న.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలన్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు,కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.